స్వతంత్ర భారత ద్వితీయ ప్రధాని, భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. లాల్ బహూదర్ శాస్త్రి నిరాడంబరతకు ప్రతిరూపం, దేశభక్తి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ఆహార భద్రతలో రైతుల పాత్రను గుర్తించి ఆయన ఇచ్చిన "జై జవాన్ – జై కిసాన్" నినాదం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్పూర్తిని రగిలిస్తూనే ఉంటుంది. కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ లాల్ బహూదర్ శాస్త్రి చూపిన నాయకత్వం, కర్తవ్యనిష్ఠ మనందరికీ ఆదర్శం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి అంకితభావంతో పనిచేద్దాం.